r/telugu

Buffalo buffalo Buffalo buffalo buffalo buffalo Buffalo buffalo (sentence embedding )
▲ 8 r/telugu

Buffalo buffalo Buffalo buffalo buffalo buffalo Buffalo buffalo (sentence embedding )

In this Youtube video​, it is explained that, using a single word “buffalo” ​we can construct a complicated sentence. This is possible because “buffalo” can function as a noun, adjective, and verb in different contexts (see the video for reference).​​​

“Buffalo buffalo buffalo” is a valid sentence, meaning “the buffalo from Buffalo, New York, are being intimidated by other buffalo.” The narrator in the video goes on to create an even more complex sentence using only the word “buffalo.”

More about buffalo sentence here

In Telugu, we already have poetic wordplay using a few syllables or just two words, and so on. But can we also construct a full Telugu sentence using just one word? When I say Telugu, let’s consider spoken Telugu (without getting into whether it is strictly a standard Telugu word or not).​

Few sentences I can think of immediately

  • చెప్పు చెప్పు (slipper, tell)
  • కొట్టు కొట్టు (hit shop/ shop hit)
  • ఆడు ఆడు (that fellow plays (āḍu is accent form of vāḍu))
  • అను అను అను (say​ ​"​anu of anu village"( anu is a village ​near shimla)) in telugu, village name comes before actual name

I think "అను అను అను" can even be seen as a recursive fractal:

  • "అను అను అను" అను..

అను has many meanings,

అను అను అను అను ( anu(name) say anu(village) anu(name) )

I understand that postpositions and grammatical cases make this difficult in Telugu, but let’s try our best

If its too tough, ​May be we can allow just inflections along with just one word and ​build long valid sentence like

అను ​అనుతో అను

u/MainHoneydew8018 — 3 hours ago
▲ 5 r/telugu

Looking for nicknames for a baby

I don't know if this is correct sub. We are expecting baby soon. Mudduperlu list chesthunnam(both papa and babu ki). Konni names unnay kani satisfaction ledu. Meeku nachina/telsina perlu cheppagalaru. And vere sub lo post chesa, i got sarcastic answers, they didn't help much. So ikkada help aduguthunna.

reddit.com
u/Possible_Bedroom_350 — 23 hours ago
▲ 25 r/telugu

ఇట్లు, కఠోరకలం కమలాకర రావు - ఉప సంపాదకుడు - తిమిర సంహరణం !

నేపధ్యం:

వార్తా పత్రికలు జోరుగా హవా కొనసాగిస్తున్న రోజులవి. 'తిమిర సంహరణం' వార్తా పత్రిక లో Sub-Editor గా పని చేస్తున్న 'కఠోరకలం కమలాకర రావు' Feature Writer అందుబాటు లో లేనందున Chief Editor ని ప్రాధేయపడి మరీ బలవంతంగా ఒప్పించి, ప్రపంచానికి కనీ వినీ ఎరుగని కొత్త తెలుగు పదాలని పరిచయం చేద్దామనే దుగ్ధ తో తానే Software Industries మీద ఒక ఆర్టికల్ వ్రాస్తారు. తన వ్యాసాన్ని చదివి దిగ్భ్రాంతి కి గురైన Chief Editor కి, కమలాకర రావు కి మధ్య జరిగే సంభాషణ.

అసిస్టెంట్ – సర్.! నిన్న సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ ల మీద మీరు రాసిన ఫీచర్ అర్టికల్ మీద చీఫ్ ఎడిటర్ గారు మీతో మాట్లాడాలని రమ్మన్నారు సర్..!

కమలాకర్రావ్ – సరేనయ్యా.. ఇదుగో ఇప్పుడే వెళ్తున్నా..

  -  ఆ..ఆ..రావయ్యా ‘కమలాకర్రావ్’ కూర్చో..! నువ్వు రాసిన కళా ఖండం మీద చాలా మాట్లాడాలి. Sub-editor వి కాస్తా Feature writer అవతారమెత్తి జిజ్ఞ కొద్దీ ‘యువ తరం’ లో ఫీచర్ రాస్తానని పట్టుబట్టావ్. సరే అన్నందుకు ఇదిగో..ఇప్పుడు అనుభవిస్తున్నాను.

థాంక్యూ సర్..! ఈ ఆధునిక జీవనం లో నిత్యం ఆంగ్లమూ ఆంగ్లమూ అంటూ ప్రాకులాగే యువతరానికి, ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని తెలుగు పదాల్ని పరిచయం చేద్దామని ప్రయత్నించాను. మీ ఆరంభం చూస్తే మీకు చాలా నచ్చినట్టుగా గోచరిస్తోంది.

- ఆ..ఆ.. వర్ణనాతీతం గా ఉంది. అందుకే నీ ఆర్టికల్ ని, నీ ముందే చదివి వినిపిద్దామని పిలిపించాను. విని తగలడు..

- “శీర్షిక: ‘సున్నితపు తొడుగు’ పరిశ్రమలపై మొగ్గు చూపుతున్న యువత...!”

-  ఏమిటయ్యా ఇది ? నీ శ్యార్ధం, నా పాటిమట్టి కాకపోతేను...! ద్వంద్వార్ధం ఇంత ప్రస్ఫుటం గా ప్రతిధ్వనిస్తూ ఉంటే ఎలా వాడబుద్ది అయ్యింది ఇంత అనుచిత వాక్యాన్ని? Wear కి Ware కి కూడా తేడా తెలియట్లేదా నీకు?

‘సున్నితపు సామాను’ అంటే ఎబ్బెట్టు గా ఉంటుంది అని అలా ప్రయత్నించాను గురువు గారు. అయినా మొబైల్ ని ‘కరవాణి, చేవాణి ’ అని నేను మొట్ట మొదటి సారి అనువాదం చేసినప్పుడు రాని తర్కం ఇప్పుడెందుకు వస్తోందో ? ‘కరవాణి, చేవాణి’ అంటే ‘చేయి స్వరం’ అని అర్ధం. ఎవరైనా ప్రశ్నించారా ? ఇదీ అంతే..

- “ఆధునిక ప్రపంచం లో అనేక రంగాల్లో కొలువులున్నా అత్యధిక శాతం మంది యువత ‘సున్నితపు తొడుగు’ పరిశ్రమల వైపే మొగ్గుచూపుతున్నారు. కెరీర్ ఆరంభం లోనే 6 అంకెల జీతం, సులభతరమయ్యే విదేశీయానం, సౌకర్యవంతమైన కార్యాలయాలు, యువతని ఆకర్షిస్తున్నాయ్. ఈ క్రమం లో ‘తిమిర సంహరణం’ ఈ రంగంలో పనిచేస్తున్న యువతను పలకరిచింది. ఆ విశేషాలు మీ కోసం”

- ఆ 'తొడుగు' మినహాయిస్తే ఈ ముక్క బానే చచ్చింది మళ్ళీ..!

కృతజ్ఞతలు..

- “నేను ఈరోజే కార్యాలయం లో చేరాను. ‘జ్వాలా నక్క’ అంతర్జాలదర్శిని లో మా బృందనాయకుడు చాలా మెళకువలు నేర్పుతున్నారు. 'తాజా మనుషులు' అందరం చాలా నేర్చుకుంటున్నాం - 'సీమ రేగి పండు' ఉద్యోగి” 

- ఏం చెప్పదలచుకున్నావ్ నాయనా ఇక్కడ ? ఈ 'తాజా మనుషులు' ఎవరు ?

Freshers సార్, Firefox - జ్వాలా నక్క, Browser – అంతర్జాల దర్శిని, Apple – సీమ రేగి పండు. మీకు అర్ధం కావటం లేదు..ఈ రోజుల్లో ఇదే ట్రెండ్.

- “మాకు శిక్షణ చాలా బాగా జరుగుతోంది. సాయం సంధ్యలో అల్పాహారం కొరకు ఉచితంగా మాకు ‘వేడి కుక్క’ లను సరఫరా చేస్తున్నారు. వాటిని ‘సూక్ష్మ తరంగ జ్వలిత పొయ్యి’ లో వేడి చేసుకుని మరీ ఆరగిస్తున్నాము. ఆట విడుపు సమయం లో ‘కాఫీ విసర్జిని’ నుండి విసర్జింప బడిన వేడి పానీయములను అస్వాదిస్తున్నాం. శుక్ర వారం పూట రంగు రంగుల ‘ఏక ముక్క వస్త్రము’ లలో స్త్రీ 'తాజా మనుషులు' తళుక్కుమంటున్నారు. – 'సూక్ష్మ సున్నితం' ఉద్యోగి”

-  ఈ సుంఠ  ఎవడో కానీ ఉద్యోగం తప్పితే అన్ని పనికి మాలిన విషయాలు మాట్లాడాడు. వీడ్ని మన పత్రిక తరపున ఇంటర్వ్యూ తీసుకోటానికి నువ్వు ఉండనే ఉన్నావ్. సరిపోయారు, దొందూ దొందే..! నీ ట్రూ ట్రాన్స్లేషన్లూ నువ్వూ..! అవునూ... ఈ 'సూక్ష్మ సున్నితం' ఏంటి ?

Micro Soft: సూక్ష్మ సున్నితం, ఎలా ఉంది సార్ నా ప్రయోగం ?

- ఏడ్చి మొహం కడుక్కునట్టు ఉంది.

- మీ వంశీకుల ముందుచూపుకు నా జోహార్లు. నీ శక్తి సామర్ధ్యాల గురించి ముందే అంచనా వేసారో ఏమిటో..! ‘కఠోరకలం’ అనే ఇంటి పేరును పెట్టి, అక్షరం పొల్లు పోకుండా న్యాయం చేశారు. నాకొక సందేహం, నువ్వు 'తిమిర సంహరణం' లో చేరటానికి ముందు ఎక్కడ పనిచేశావ్ నాయనా ?

గతం లో ‘పురుగుల మందు’ అనే పత్రిక లో సేవలందించాను తర్వాత అక్కడ నాడు దక్కాల్సిన గౌరవం దక్కక ఇక్కడికొచ్చాను.

- శివ శివా..! పురుగుల మందా ? అదేం దినపత్రిక నాయనా? కొంప తీసి ఆ పేరు పెట్టింది నువ్వేనా ?

సరిగ్గా చెప్పారు. కొంప తీయకుండా నేనే. సంఘ విద్రోహ శక్తులు అనే పురుగుల మీద ఎండ్రిన్ లాగ పనిచేసే పత్రిక అని దాని నేపధ్యం.

- నీ అర్టికల్ ప్రచురించే ధైర్య సాహసాలు మాకు లేవు నాయనా. నిన్ను తక్షణమే విధుల నుండి బహిష్కరించమని యాజమాన్యం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయ్. I’m sorry. You are dismissed. 

మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు సర్. నా సృజనాత్మకత మీకు నచ్చక ఈర్ష్య పడుతున్నారు కాబోలు. ‘ఆరుపలకల దేహం, కరవాణి’ లాంటి పదాల సృష్టికర్త ని. ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ వాటినే ఫాలో అవుతోంది, నా ప్రతిభ ని గుర్తించక పోవటం మీ దురదృష్టం. కానీ పెళ్ళాం, బిడ్డలు కల వాడ్ని ఇప్పటికిప్పుడు కొత్త ఉద్యోగం వెతుక్కోవటం సమయాభావం తో కూడుకున్న విషయం. అందువలన ‘గమనిక గడువు’ నిమిత్తం నెల జీతం ఇప్పించండి.

- గమనిక గడువా ? దీనర్ధం ఏమిటో క్షణం ఆలస్యం చెయ్యకుండా చెప్పేయ్..!

‘Notice Period’ ని కొత్తగా ప్రయత్నించా..!

- ఇంకొక్క క్షణం నా ముందు ఉన్నావంటే నీ పుర్రెను ఆ అచ్చు యంత్రం లో గుచ్చి మరీ ముద్రించేస్తాను, రక్త సిరా తో రేపటి ప్రతి లో మొదటి ‘పుట’ ని. పో అవతలకి..!

u/Praveen_Kadambari — 23 hours ago
▲ 19 r/telugu+1 crossposts

నీలి చుక్క(Earth)

Publishing an old one again

u/katchapi — 22 hours ago
▲ 25 r/telugu

Chennai tamil has direct telugu influence. Share some words you know.

Naina - father in Chennai telugu is nana influence.

There are several such Chennai tamil words influenced by telugu. I only noticed after my husband who is tamil pointed it out. Will add more words as i remember. Share the words you have noticed

reddit.com
u/apologyforexistin — 1 day ago
▲ 8 r/telugu

Meaning of Gunta and Munda?

I’ve been hearing these words for a long time now. I want to know if they are just slang words or vulgar

reddit.com
u/icebear-guy — 1 day ago
▲ 22 r/telugu

Foods in Tamil Nadu Telungu- తమిఴ్నాడు తెలుంగులో తిండి పేరులు

Basic words
Food- భోజనం/కూడు (bhōjanam/kūḍu)
Rice- వన్నం/బువ్వ (vannam/buvva) (babyspeak)
Food or sometimes only tiffin- తిండి (tiṇḍi)
To eat- బోంచెయి/ తిను (bōnceyi/tinu)
Hunger - ఆంకిలి (āṅkili)
I am hungry- ఆంకిలి ఎత్తి (āṅkili etti)

Specific foods
Idiyappam- దంతికలు (dantikalu)
Idli- ఇడ్డూలు (iḍḍūlu) (heard from a Reddiar friend)
Dosa- అట్టు (aṭṭu) (used in a very specific context, like pesaraTTu)
கூட்டு- కలుసుకూర (kalusukūra)
Fry- வறுவல் - వేంపడం (vaṟuval - vēmpaḍaṁ)
துவையல்- ఊర్పిండి (tuvaiyal - ūrpiṇḍi)

Seafoods
Fish- చాంప (cāmpa)
Fish curry- చాంప పులుసు/ చాంపులుసు (cāmpa pulusu/cāmpulusu)
Prawns- రొయ్య (royya)

reddit.com
u/Horror-Panic-2802 — 1 day ago
▲ 25 r/telugu

Telugu translation

Can anyone explain what this guy tryna say to me?

Also how to respond back in Telugu itself.

Teach me folks.

u/Sure_Cockroach_8104 — 2 days ago
▲ 42 r/telugu+1 crossposts

హోటెల్ ఖర్జూరం - ఇట్లు, రేగిపండేశ్వర రావు

నేపథ్యం: హోటెల్ ఓనర్ కి ఒక సౌండ్ ఎలర్జీ రోగి కం వన్ టైం కస్టమర్ రాసిన వ్యంగ్య లేఖ.

హోటెల్ ‘ఖర్జూరం’ యజమాని గారైన మహారాజశ్రీ ‘మిక్కిలినేని ముష్టాన్నం’ గారికి, తమ పలహారశాల ఒక పూట వినియోగదారుడైన ‘రేగిపండేశ్వర రావు’ నమస్కరించి వ్రాయునది. ఇచట అంతా క్షేమం (నేను మినహాయించి నా కుటుంబం అంతా), మీ హోటెల్ లో కస్టమర్ లు తప్పించి అచట అంతా క్షేమమని తలుస్తాను.

ఏక కుశులోపరి ! (ఉభయ కుశులోపరి అని రాసి, నేను కూడా కుశలం అనటానికి ధర్మం అడ్డు తగులుతోంది. అర్ధం చేసుకోగలరు).

గత వారం నా జాతకం లో దుష్ట ఫలాలు ప్రవేశించాయని, ప్రయాణం చేయటం మంచిది కాదు అని, మా సిద్ధాంతి మిత్రమ శుంఠ ‘చీకటిరంధ్రం గ్రహశకలశాస్త్రి’ ఎంత వారించినా వినకుండా మా చిన్నాడ్ని చూడటానికని, రోళ్ళు పగిలే రోహిణీ కార్తి ఎండ లో మధ్యాహ్నం బండికి దిగియున్నాను హైదరాబాదు లో.

అడుగు పెట్టాకా కానీ తెలియలేదు. ఆ దుష్ట ఫలం మరేదో కాదు, మీ ‘ఖర్జూరమే’ అని. అవును ! పాపం మా ‘గ్రహ శకలం’ గాడు చెప్పింది అక్షరాలా నిజం.

నెత్తి మీద జీడి మామిడి కాయని పెడితే క్షణం లో కాల్చేసి జీడిపప్పు చేసేసే సూర్యుడు, కడుపు లో ఆకలికి అలమటిస్తున్న ఆత్మారాముడు అనే రెండు శక్తుల ఒత్తిడి కి తాళ లేక విల విల లాడుతున్న నాకు తమ హోటెల్ ‘ఖర్జూరం’ బోర్డు కనిపించినది.

ఫల నామధేయుడ్నైన నాకు, ఫల నామధేయురాలైన మీ హోటెల్ కనిపించటం శుభసూచకం అనుకొని, సంధి కుదిరి సత్ఫలితాలుంటాయేమోనని భావించి అడుగుపెట్టి యున్నాను తమ ‘ఖర్జూరం’ లోనికి. పెట్టీ పెట్టగానే ఒక పిల్లదండు మేస్తున్న టేబుల్ పక్కనే కూర్చోపెట్టాడు మీ బేరర్ ‘మొండి హస్తేశ్వర రావు’.

అక్కడ రోళ్ళ తయారీ పరిశ్రమ నడుస్తోందో, 'పిల్ల రాక్షసులు ఐస్ క్రీం మేయటం' అనే ప్రక్రియ జరుగుతోందో తెలుసుకోటానికి 10 నిమిషాల సమయం పట్టినది. ఇంతలో  కోన్ ఐస్ క్రీం మేస్తున్న ఓ కుర్ర కుంక, గొట్టం క్రింది భాగాన్ని కొరికి, పక్కనే నూడిల్స్ తింటున్న ఓ బీహారీ వాడి ప్యాంటు వెనుకభాగం లో నిట్టనిలువు గా ప్రతిష్ఠించే సరికి, ఆ శీతల హిమ నదీ ప్రవాహానికి దక్షిణ పీఠభూముల్లో కలిగిన ప్రకంపనానికి గుండె ఝల్లు మని చివుక్కున పైకి లేచేసరికి ఆ అదురుకి అతని చేతిలో ఉన్న ఫోర్క్ 343 m/s వేగంతో (ధ్వని వేగం) ప్రయాణించి, అప్పుడే భోంచేసి చెయ్యి కడుక్కుంటున్న ఓ అభాగ్యుడి పిరుదుల్లో కొబ్బరిచెట్టుకి గుచ్చిన కొడవలి టైపులో దిగబడి పోయేసరికి, అతడు పెడుతున్న ఆర్తనాదాలను వినలేక, నా సున్నిత శ్రవణాలని గట్టిగా మూసుకోవటం తప్ప ఏమియూ సాయలేని నిస్సహాయుడనై మిన్నకుండి పోయినాను. 

మనవి 1: దయచేసి గాజు కప్పుల్లో, ఇనప చెంచా లతో పిల్లలకి ఐస్ క్రీం లు సర్వ్ చెయ్యద్దని భారీ మనవి. దానికి బదులు రబ్బరు చెంచా, రబ్బరు చిప్పల్లో సర్వ్ చెయ్యమని కోరుకొను వాడను. అలాగే కొరకటానికి వీల్లేని ఇనప గొట్టాలలో కోన్  ఐస్ క్రీం లను సరఫరా చేయ వలసినదిగా మనవి. 

మనవి 2: సొట్టలు పడిన సత్తు పళ్ళాలలో భోజనాలు పెట్టద్దని మనవి. కంకరాళ్ళ పై రోడ్డు రోలర్ దొర్లుతోందా ? అన్న భ్రాంతి కి గురి చేసినది. ఆ అసమతల పళ్ళాల నాట్య విభావరి.

అడిగిన ప్రతి పదార్ధానికి 'లేవు' అని మొండి హస్తం చూపించే సార్ధక నామధేయుడైన మీ 'మొండి హస్తేశ్వర రావు' ని, ఏం నాయనా మరి ఏమున్నాయి తినటానికి ? అని అడగగానే, భర్తన్ బాదుతా, తోటి కోడల్ తోల్తా, అమ్రిత్సరీ కుల్చా, బతూర, కరేలా బార్త, లౌకీ కే కోఫ్తే అంటూ కనీ వినీ ఎరుగని వంటకాలని ఏకరువు పెట్టేస్తుంటే, నాయనా ఆగు, నార్త్ ఇండియన్ కాదు స్వచ్చమైన సౌత్ ఇండియన్ భోజనం ఉంటే పట్రా అని యున్నాను.

వాడు ‘తాళి’ ఉంది సార్ తెమ్మంటారా ? అనగానే అరికాలి మంట నెత్తి మీదకి వచ్చి, హవ్వ హవ్వ.. పవిత్రమైన తాళి బొట్టుని తినటానికి తీసుకొస్తాను అంటావా ? అంటూ ఒంగోబెట్టి వాడి వీపు మీద నాలుగు మినప రొట్టె లు వేసియున్నాను. అది తాళి కాదు, ‘సౌత్ ఇండియన్ తాలీ’ అని తెలుసుకొని పాపం వెర్రి సన్నాసికి క్షమాపణలు కూడా తెలియజేసి యున్నాను.

తరువాత వాడు తెచ్చిన తాలీ ని చూసి దుఃఖం పొంగుకు వచ్చినది. దానికి 'సౌత్ ఇండియన్ తాలీ' అనే పేరు పెట్టే కంటే ‘సౌత్ ఇండియన్ ఉగ్గు గిన్నెలు’ అని పెట్టి ఉంటే న్యాయం జరిగేది అని తోచినది. 24 టానిక్ మూతల్లాంటి చిప్పల్లో మిల్లీ గ్రాముల పరిమాణం లో ఉన్న పదార్ధాలను బూతద్దం లో చూస్తే గానీ గుర్తు పట్టలేను అని తెలుసుని, పక్కనే ఉన్న నూపొడి కలుపు కొని తిని యున్నాను. మధ్యలో ఆ వెల్లుల్లి ఆవకాయ ఒకటి తమ బొంద, బియ్యం గింజ పరిమాణంలో ఉన్న ఆ పదార్ధం  వెల్లుల్లిపాయో ఆవగింజో తెలుసుకోవటానికి ఆరు నిమిషములు పట్టినది. ఆ వెల్లుల్లిపాయని నా చొక్కా గుండీ రంధ్రం లో భద్రపరచి ఇందాకే గిన్నిస్ బుక్ వాళ్ళకి అందజేసాను. మైక్రో బయాలజీ రంగం లో దాన్ని పండించిన వాళ్ళకి ఏమైనా అవార్డు వస్తుందేమో చూడాలి మరి. 

ఎరుపు రంగులోకి మారిపోతున్న ముఖం, చెవుల్లోంచి కమ్ముకొస్తున్న పొగలూ చూసుకున్నాక కానీ అర్ధం కాలేదు. నేను తిన్నది నూపొడి కాదు మిరియాల పొడి అని. పైగా దానికి 'పెప్పర్' అని ఆంగ్ల నామధేయమొకటి తమ శ్యార్ధము. ఆరోజు నుంచి ఈరోజు దాకా విరోచన పరంపర ఆగటం లేదు. ఈ లేఖని కూడా విసర్జన శాల నుండే వ్రాయుచున్నాను.

మనవి 3: వంటకాలకి తాళి బొట్టు, మంగళ సూత్రం, పసుపు కొమ్ము లాంటి పేర్లు పెట్టకుండా చక్కగా ‘అచ్చతెలుగు భోజనం’ లాంటి పేర్లు పెట్టవలసినది గా మనవి.

మనవి 4: ఇనప డబ్బాలలో పేర్లు లేని డబ్బలలో మిరియాల పొడి, ధనియాల పొడి లాంటివి వేయకుండా, చక్కగా కాగితాల పై తెలుగు లో ‘మిరియాల పొడి’ అని రాసి ఆ డబ్బాల పై అంటించాలని మనవి.

స్వస్తి..!

ఇట్లు తమ బాధితుడు,

సున్నితశ్రవణం కాశీరేగిపండేశ్వర రావు

u/Praveen_Kadambari — 2 days ago
▲ 9 r/telugu

Is there poetry recordings where the arasunna is pronounced?

The nasalisations which are currently deemed obsolete once used to be pronounced in Telugu. Even the name of the language was Telungu or Tenungu at some point, so the literature from the past used to have this Arasunna when it was written (noticed it in Annamayya Sankirtanalu), has it been preserved by the translators and publishers or have they dropped it as it has become an extinct feature today? This sound is still pronounced in my dialect of Tamil Nadu Telungu.

reddit.com
u/Horror-Panic-2802 — 2 days ago
▲ 18 r/telugu

World Dance day

World Dance day anta guys..

Celebrations at Vijayawada GVRGM College

Have to appreciate those dancers for their performance, it was pleasant to watch them dance gracefully 👏🏼

Classical dance >>>>>>>>🤌🏻

u/BatOne4050 — 3 days ago
▲ 2 r/telugu+1 crossposts

Looking for vocal only version of M S Rama rao Sundarakanda

I am looking for the version of Sundarakanda By M.S.Rama Rao vocal only version without any music. Without any instrumentals i checked amazon music and youtube

reddit.com
u/Remarkable_Lock_6733 — 11 hours ago