u/Acrobatic_Top9947

నీ చెలిమిలో తెలియకుండా కరిగిపోయిన కాలం, నేడు కదలనని మారాం చేస్తుంటే..

ఏంటో ఇళయరాజా playlist sudden గా ఆగిపోయినట్టు,

హరివిల్లు రంగులన్నీ ఒక్కసారిగా తెల్లబోయినట్టు

ఊసులాడే జాబిలి లేక ఊపిరి ఆగినట్టు

సూర్యుడు మాయమై లోకమంతా చీకటి అయినట్టు

గలగల సెలయేరులాంటి జీవితం ఎడారి లా మారినట్టు

నిన్నటి నేను ఇవ్వాళ్టి నన్ను చూసి గుర్తుపట్టలేనట్టు

ఏమీ అర్ధం కాకుండా ఉంది.

లోపల ఇంత జరుగుతున్నా పైకి ఏమీ కానట్టు ఉండడం ఇంకా కష్టంగా ఉంది.

ఉత్తుంగ తరంగమై నను తడిపి పోయిన అలా.. నువు లేక అడుగు సాగేది ఎలా??

reddit.com
u/Acrobatic_Top9947 — 14 days ago