u/Adventurous-Lynx4963

Image 1 —
Image 2 —
Image 3 —
Image 4 —
Image 5 —

చాలా మందికి తెలిసే ఉంటుంది, మూవీ టైటిల్ వీడియో లాస్ట్ లో వచ్చే ఈ షాట్స్ (బాక్గ్రౌండ్ ఫ్రేమ్స్) అన్ని సీన్స్ చేసారు (నందు చిన్నప్పుడు సాదు దగ్గర పెరిగిన దృశ్యాలు). కానీ, నిడివి ఎక్కువ అవ్వడం వల్లనో తెలీదుగాని ఇలా మొదటి పాటలో హీరో తన గతాన్ని గుర్తుచేసుకుంటూ ఎలా ముందుకు సాగుతున్నాడు అని దృశ్యరూపంలో త్రివిక్రమ్ చూపుతారు

దీన్నే లిరిక్స్ రూపంలో "తన ఎదలో పగమేల్కొలుపుతూ, ఒడిదుడుకుల వల చేదించుతూ, ప్రతి నిత్యం కథనం జరుపుతూ, చెలరేగే ఓ శరమతడు" అని రాసారు.

ఇందులో నాకు వ్యక్తిగతంగా ఇంకా బాగా నచ్చిన విషయం - లిరిక్స్ లో " చెలరేగే ఓ శరమతడు" అని వచ్చినప్పుడు మహేష్ బాబు తన గన్ లో నుంచి కొన్ని రౌండ్స్ పేలుస్తాడు (సింబాలిక్ గా ధనస్సు ని ఎక్కుపెట్టి శరం(బాణం)ని వదిలినట్టు). అలాగే కెమెరా కూడా ఫాస్ట్ గా బాబు నుంచి వెనక్కి వెళిపోయినట్టు ఎడిట్ చేసారు. కెవ్వు కేక మోమెంట్ ఫస్ట్ టైం నాకు ఇది అర్థమైనప్పుడు!

u/Adventurous-Lynx4963 — 16 days ago